Published On:

TG Schools Academic Calendar: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

TG Schools Academic Calendar: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

Telangana Schools Academic Calendar 2025-26 Released: తెలంగాణలో రెండు రోజుల్లో బడిమోత మోగనుంది. జూన్ 12 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ విడుదల అయింది. ఇందులో 230 వర్కింగ్ డేస్ ఉంటాయని అన్ని జిల్లాల డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఎగ్జామ్స్, హాలీడే తేదీలను వెల్లడించింది.

 

ఇక, జూన 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న తరగతులు ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు ఉంటాయని పేర్కొంది. 10వ తరగతి విషయానికొస్తే.. జనవరి 10లోగా సెలబస్ పూర్తి చేయాలని పేర్కొంది. ఇక, మిగతా తరగతులకు ఫిబ్రవరి 18లోపు సిలబస్ల కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.