Published On:

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు!

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు!

Five medical colleges in Telangana: తెలంగాణ వైద్య విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో ఐదు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వైద్యశాఖ మంత్రి పీజీ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్ లోని కింగ్ కోఠి, పెద్దపల్లి, భద్రాచలం, బాన్సువాడ, మిర్యాలగూడలలో మెరికల్ కాలేజీలను ఏర్పాటు కానున్నాయి.

 

కాగా, 10ఏళ్ల క్రితం 2016 ఏడాదిలో సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. 2018, 2019 ఏడాదిలలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చాయి. 2023, 2024లలో మరో 9 కళాశాలలు ఏర్పాటు చేసింది. తాజాగా, మరో 5 కళాశాలల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో మొత్తం రాష్ట్రంలో 39 మెడికల్ కాలేజీల సంఖ్య చేరనున్నాయి.

ఇవి కూడా చదవండి: