Published On:

Heavy Rains: బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు !

Heavy Rains: బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు !

Heavy Rains in Telugu States: అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

 

తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అలాగే సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: