Published On:

Indrakeeladri: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Indrakeeladri: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Telangana Bangaru Bonam To Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారికి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు బంగారు బోనం, సారె, కానుకలు సమర్పించారు. సుమారు 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజుల డప్పులు, కోలాటాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఘాట్ రోడ్డు మీద దుర్గమ్మ చెంతకు బంగారు బోనం చేరుకుంది.

దేవస్థానం తరపున ఏపీకి చెందిన చిన్నారులు నెమలి నృత్యం, కరగం నృత్యం, తప్పెట్లు, కోలాటం, సాంప్రదాయ భజనలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో, సుఖశాంతులతో, అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని బంగారు బోనం సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న బంగారు బోనాన్ని మంత్రి ఆనం అందుకున్నారు. అనంతరం మంత్రి ఆదేశాల మేరకు బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి వచ్చిన కమిటీ సభ్యులు, భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ వెల్లడించారు. బంగారు బోనం సమర్పణ కోసం చేసిన ఏర్పాట్లపై మంత్రి ఆనంకు ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: