Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్

MP Raghunandan Rao Receives Threatening Calls once Again: తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ ఆపాలని రెండు వేర్వేరు నంబర్ల నుంచి వ్యక్తులు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ టీమ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని, కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు. తమ ఫోన్లు ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు.
ఈ నెల 23న ఎంపీకి తొలిసారి బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే ఆయన డీజీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. బెదిరింపుల నేపథ్యంలో రఘునందన్‌రావుకు ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనంతోపాటు అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది. రఘునందన్‌రావు రెండురోజుల కింద యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రఘునందన్‌రావు మరోసారి ఆసుపత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు.