Published On:

Rajiv Yuva Vikasam: బిగ్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారా? గడువు ఇంకా ఒక్కరోజే..!

Rajiv Yuva Vikasam: బిగ్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారా? గడువు ఇంకా ఒక్కరోజే..!

Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి నిమిత్తం అన్ని వర్గాలకు సుమారు రూ.4లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఇందు కోసం మార్చి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. కాగా, దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 14తో గడువు ముగియనుంది.

 

అయితే, ఈ పథకం కోసం మీ సేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు దాదాపు 16 లక్షలకు పైగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కానీ ఇందులో రాజీవ్ యువ వికాసం పథకానికి నిన్నటి వరకు దాదాపు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

 

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ 14తో ఈ పథకానికి గడువు ముగియనుండగా మరింత పొడగించాలని పలువురు కోరుతున్నారు.

 

ఇదిలా ఉండగా, రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరు వ్యాపారులు చేస్తున్న ఈబీసీలకు ప్రభుత్వం వంద శాతం రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలు తీసుకుంటే 90 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. కాగా, ఓ లబ్దిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80 శాతం, రూ.2 నుంచి రూ.4 లక్షల్లోపు రుణాలకు 70శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.

 

ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి ఆధార్ కార్డుతో పాటు కుల, ఆదాయ సర్టిఫికెట్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫోటో, లబ్దిదారుడి ఫోన్ నంబర్ అవసరం ఉంటాయి. కాగా, యువ వికాసం దరఖాస్తు చేసేందుకు ఓబీఎంఎంఎస్ పోర్టల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు ఉన్నాయి. తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడం, ఒక్కో దరఖాస్తు చేసేందుకు కనీసం 30లకు పైగా సమయం తీసుకుంటుందని దరఖాస్తు దారులు వాపోతున్నారు.