IPS Transfers: ఏడుగురు ఐపీఎస్ ల బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు
Seven IPS officers Transfered: తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్ కొనసాగనున్నారు. హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీగా ఉన్న చైతన్యకుమార్ ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కాంతిలాల్ సుభాష్ ను కుమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా స్థానచలనం కల్పించింది. అలాగే మైనార్టీ వెల్ఫేర్ లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ను చార్మినార్ రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావుకు స్థానచలనం కలిగింది.