Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీలవి అవకాశవాద రాజకీయాలు రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది.
Munugode: టీఆర్ఎస్, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయిన వారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణకు దిక్సూచి కావాలన్నారు. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఎవరికి లొంగిపోయారని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమేనని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు.
అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్‌కు వామపక్షాల మద్దతివ్వడం బాధకరమని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభమని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్‌తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఇప్పుడు బీజేపీలో చేరి వేలకోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని మండిపడ్డారు.