Gaddar Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డులు.. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ మూవీస్ ఇవే

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అయితే 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి జాబితాను విడుదల చేశారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులతో తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు విడుదల చేసేందుకు దోహదపడతాయని సినీ ప్రముఖులు తెలిపారు.
కాగా ఉత్తమ చిత్రాల జాబితా
2014
బెస్ట్ మూవీ: రన్ రాజా రన్
సెకండ్ బెస్ట్ మూవీ: పాఠశాల
థర్డ్ బెస్ట్ మూవీ: అల్లుడు శీను
2015
బెస్ట్ మూవీ: రుద్రమదేవి
సెకండ్ బెస్ట్ మూవీ: కంచె
థర్డ్ బెస్ట్ మూవీ: శ్రీమంతుడు
2016
బెస్ట్ మూవీ: శతమానంభవతి
సెకండ్ బెస్ట్ మూవీ: పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ మూవీ: జనతా గ్యారేజ్
2017
బెస్ట్ మూవీ: బాహుబలి2
సెకండ్ బెస్ట్ మూవీ: ఫిదా
థర్డ్ బెస్ట్ మూవీ: ఘాజీ
2018
బెస్ట్ మూవీ: మహానటి
సెకండ్ బెస్ట్ మూవీ: రంగస్థలం
థర్డ్ బెస్ట్ మూవీ: కేరాఫ్ కంచరపాలెం
2019
బెస్ట్ మూవీ: మహర్షి
సెకండ్ బెస్ట్ మూవీ: జెర్సీ
థర్డ్ బెస్ట్ మూవీ: మల్లేశం
2020
బెస్ట్ మూవీ: అల వైకుంఠపురములో
సెకండ్ బెస్ట్ మూవీ: కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ మూవీ: మిడిల్ క్లాస్ మెలోడీస్
2021
బెస్ట్ మూవీ: ఆర్ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ మూవీ: అఖండ
థర్డ్ బెస్ట్ మూవీ: ఉప్పెన
2022
బెస్ట్ మూవీ: సీతారామం
సెకండ్ బెస్ట్ మూవీ: కార్తికేయ2
థర్డ్ బెస్ట్ మూవీ: మేజర్
2023
బెస్ట్ మూవీ: బలగం
సెకండ్ బెస్ట్ మూవీ: హనుమాన్
థర్డ్ బెస్ట్ మూవీ: భగవంత్ కేసరి