Home / Revanth Reddy
Harish Rao Thanneeru fire on congress government: కాంగ్రెస్ ఏడాది పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ‘ఈ సర్కారు ఉత్త బేకారు’గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు, అసత్య ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఏ వర్గమూ వీరి పాలనను మెచ్చకోవటం లేదని తెలిసే.. ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనలో రాష్ట్రం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మంచి ఆర్థిక […]
Ex Minister Harish Rao Comments about Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ పేరును చెడగొడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాల నోటికి మొక్కాలన్నారు. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. వరంగల్ […]
KCR Comments On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి నేటికీ 11 నెలలు పూర్తి కావొస్తుందని, ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పటికే తెలుసొచ్చిందన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు సినీ నిర్మాత […]
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిమిషాలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిని ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిఎడి ప్రొటోకల్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశగా దూసుకువెడుతోంది. ఈ నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.