International Trip: మొదటి సారి విదేశాలకు వెళ్తున్నారా..? ఈ టిప్స్ మీ కోసమే
Tips for first time International Travelers: ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. కొత్త ప్రదేశాలు, విభిన్న సంస్కృతి, కొత్త వ్యక్తుల పరిచయం మనకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. కానీ మీరు మొదటిసారి విదేశాలకు వెళుతుంటే.. ఉత్సాహంతో పాటు కొంత ఆందోళన ఉండటం సహజం. ఇలాంటి సమయంలో ఏలాంటి సమస్యలు ఎదురైనా వాటిని నివారించడానికి కొంచెం ముందస్తు ప్రణాళిక అవసరం. కాబట్టి మీ ప్రయాణాన్ని సులభం, సరదాగా కొనసాగేలా చేసేందుకు ఉపయోగపడే ఆరు స్మార్ట్ చిట్కాలను తెలుసుకోవడం ముఖ్యం.
మీరు విదేశాలకు వెళ్లబోతున్నట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి
పాస్‌పోర్ట్, వీసా: ముందుగానే సిద్ధం చేసుకోండి. మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటులో ఉండాలి. దాని గడువు తేదీ కనీసం 6 నెలల తర్వాత ఉండాలి.
మీరు ప్రయాణించే దేశ వీసా నియమాలను ముందుగానే చెక్ చేయండి. అంతే కాకుండా ట్రిప్ కు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి.
విమాన, హోటల్ బుకింగ్‌లు: ముందుగానే ప్లాన్ చేసుకోండి. ముందుగానే టిక్కెట్లు, హోటళ్లు బుక్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా అనవసరమైన ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు. ఎయిర్ పోర్టు నుండి హోటల్ చేరుకోవడానికి ఏ కార్ లేదా ట్రైన్ ఏది ఉత్తమమో ముందుగానే తెలుసుకోండి.
ఫారెక్స్: డబ్బు ఉంటేనే సరదా ఉంటుంది. కొంత స్థానిక కరెన్సీని మీ దగ్గర ఉంచుకోండి. అంతర్జాతీయ లావాదేవీల కోసం మీ డెబిట్/క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకోండి. కరెన్సీ మార్పిడి ఎక్కడ చేయాలో ముందుగానే తెలుసుకోండి. తద్వారా మీరు తక్కువ కమిషన్‌తో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్ ట్రావెల్ అసిస్టెంట్‌గా చేసుకోండి:
గూగుల్ మ్యాప్స్ – రూట్స్ కనుగొనడానికి ఉపయోగించండి
గూగుల్ ట్రాన్స్లేటర్ – భాషా సమస్యను పరిష్కరించడానికి
స్థానిక ట్రావెల్ యాప్ – స్థానికంగా తిరగడానికి ఉపయోగించండి.
చెల్లింపు యాప్‌లు (Revolut, Wise)– మనీ ట్రాన్ఫర్ లను సులభతరం చేయడానికి మీ మొబైల్ ప్లాన్‌లో అంతర్జాతీయ రోమింగ్ లేదా eSIM కూడా చెక్ చేయండి.
ముఖ్యమైన పత్రాలు: డిజిటల్ , హార్డ్ కాపీలు రెండింటినీ దగ్గర ఉంచుకోండి. పాస్‌పోర్ట్, వీసా, టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు , బీమా యొక్క డిజిటల్ , ప్రింట్ కాపీలను మీతో తీసుకెళ్లండి. అంతే కాకుండా డాక్యుమెంట్లను క్లౌడ్‌లో (గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్) సేవ్ చేసి, కాపీలను మీ ఇమెయిల్‌లో ఉంచుకోవడం ముఖ్యం.