Tragedy in Pharma city: ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి!
2 died in Anakapalli Pharma city: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లో అర్ధరాత్రి విష వాయువులు లీకయ్యాయి. ఎస్టీపీ దగ్గర లెవల్స్ చెక్ చేస్తుండగా విషవాయువులు రిలీజ్ అయ్యాయి. ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా.. మరికందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు ఒడిశాకు చెంది బైసాల్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారు సేఫ్లీ ఆఫీసర్లు చంద్రశేఖర్, కుమార్ గా గుర్తించారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరెవరికి గాయాలయ్యాయి, పరిశ్రమలో సేఫ్టీ చర్యలు తీసుకున్నారా అనే వివరాలు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.