Heritage Tower: ‘హరేకృష్ణ హెరిటేజ్ టవర్’ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదారాబద్ శివార లో కోకా పేటలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హరే కృష్ణ మూవ్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరేకృష్ణ హెరిటేజ్ టవర్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
Heritage Tower: హైదారాబద్ శివార లో కోకా పేటలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హరే కృష్ణ మూవ్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరేకృష్ణ హెరిటేజ్ టవర్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమి అనంతరం నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
అక్షయపాత్రతో ఎంతో సేవ (Heritage Tower)
మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించేది ఆ పరమాత్ముడినే అని చెప్పారు. హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో హరేకృష్ణ పౌండేషన్ ప్రజలకు ఎంతో సేవ చేసిందని కొనియాడారు. హైదరాబాద్ లో ధనవంతులు కూడా రూ. 5 భోజనం తింటున్నారన్నారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు. మరో వైపు మహా నగరం వేగంగా అభివృద్ది చెందుతోందని కేసీఆర్ వెల్లడించారు. నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామమని తెలిపారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా నగరం
నగరానికి మంచి ఆధ్యాత్మిక కేంద్రం వస్తోందని చెప్పారు. మతమౌఢ్యంతో కొంతమంది సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని.. విశ్వశాంతి కోసం అందరూ ప్రార్థన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హెరిటేజ్ టవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఆ నిధులు విడుదల చేస్తామన్నారు. మనశ్శాంతి కోసం చాలామంది మ్యూజిక్ థెరపీ తీసుకుంటారని సీఎం చెప్పారు. ఇప్పటికే యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామన్న కేసీఆర్.. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
స్తామన్నారు.