BAC Meeting, Telangana : ముగిసిన బీఏసీ.. ఈ నెల 27 వరకు అసెంబ్లీ

BAC Meeting, Telangana : తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఇవాళ బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగునున్నది. ఈ 14న హోళీ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ జరుగనున్నది. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో నిర్వహించిన బీఏసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. రూ.3.20లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.