Last Updated:

Cheddi Gang: చెడ్డీగ్యాంగ్ రీఎంట్రీ కలకలం.. హైదరాబాద్ శివారులో దోపిడీ

పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.

Cheddi Gang: చెడ్డీగ్యాంగ్ రీఎంట్రీ కలకలం.. హైదరాబాద్ శివారులో దోపిడీ

Hyderabad: పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.

కాగా ఈ చెడ్డీ గ్యాంగ్ కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు అనుకునేలోపే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరల వరుస దొంగతనాలతో వీరు హల్చల్ చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారులోని సంగారెడ్డి జిల్లాలో భారీ దోపిడీ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలోని ఓ విల్లాలో చొరబడి 12 తులాల బంగారం దోచుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దోపిడి దొంగల కోసం వెతుకున్నారు.

అమీన్పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలోని విల్లా నెంబర్ 8లో దొంగలు పడి 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారని, దానిని మరుసటి రోజు గుర్తించిన విల్లా యజమానులు తమను సంప్రదించారని పోలీసులు వివరించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధాారంగా చెడ్డీ గ్యాంగే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా తెలంగాణలో చెడ్డీగ్యాంగ్ కదలికలు ఏమీ కనిపించలేదు. దానితో రక్షకభటులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మరల ఇప్పుడు అమీన్‌పూర్ ఏరియాలో ఈ గ్యాంగ్ దోపీడీ చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు ప్రారంభించారు.  ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: