MLA Mynampally Hanumantha Rao: మంత్రి హరీష్ రావు బట్టలూడదీస్తాను.. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజ్‌గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై ఫైరయ్యారు. హరీష్ రావు తన గతాన్ని గుర్తుంచుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

MLA Mynampally Hanumantha Rao: మల్కాజ్‌గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై ఫైరయ్యారు. హరీష్ రావు తన గతాన్ని గుర్తుంచుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన నియోజకవర్గాన్ని వదిలి మా జిల్లాలో మంత్రి హరీష్ పెత్తనం చేస్తున్నారని హనుమంతరావు విమర్శించారు. హరీష్ రావు బట్టలు ఊడదీసే వరకూ నిద్రపోనని హనుమంతరావు శపథం చేశారు.
హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాను..(MLA Mynampally Hanumantha Rao)
అక్రమంగా లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన హరీష్ రావు అడ్రస్‌ని సిద్దిపేటలో గల్లంతు చేస్తామని హనుమంతరావు ప్రకటించారు. రాజకీయంగా ఎంతోమందిని హరీష్ రావు అణచివేశాడని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తెరాసలోనే వున్నాను.నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది.మా ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం.మెదక్‌లో నా కొడుకు.. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తాం.మెదక్‌లో నా కొడుకుని కచ్చితంగా గెలిపించుకుంటాను అంటూ మైనంపల్లి స్పష్టం చేసారు.
ఇవి కూడా చదవండి:
- Road Accident : పాడేరులో విషాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
- Jabardasth Comedian : ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ జబర్దస్త్ కమెడియన్ పై కేసు నమోదు..