Last Updated:

Law student raped by MLA PA: లా విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం

వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది.

Law student raped by MLA PA:  లా విద్యార్థినిపై  ఎమ్మెల్యే పీఏ అత్యాచారం

Warangal: వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది. ఈ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ఆ విద్యార్థిని భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది.

హన్మకొండలోని ప్రైవేటు లా కాలేజీలో ఎల్ఎల్బి నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీకి దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. ఈ హాస్టల్ ను వేముల శోభ అనే మహిళ నిర్వహిస్తోంది ఆమె ఆ విద్యార్థినిపై వత్తిడి తెచ్చి బలవంతంగా తనకు పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గరికి గత కొద్దిరోజులుగా పంపుతోంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పీఏ వేముల శివ కుమార్ ఈ హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభకు మరిది అవుతాడు. అతనితో పాటు హనుమకొండ చౌరస్తా దగ్గర్లో మెడికల్ షాపు నడుపుతున్న కోటవిజయ్ కుమార్ అనే వ్యక్తి.. తన మీద అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

వీరే కాకుండా నగరంలోని అనేక చోట్లకు హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ తనను బలవంతంగా పంపించేదని ఆమె పేర్కొంది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభా,వేముల శివ కుమార్, కోట విజయ్ కుమార్ లను గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి: