Last Updated:

MLA Rajasingh: కేటీఆర్.. నీకు డబుల్ బెడ్రూం ఇండ్ల డేటా అసలు తెలుసా ? ఎమ్మెల్యే రాజాసింగ్

బుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా ? లేకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని కాని తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా కట్టలేదని రాజాసింగ్ ఆరోపించారు.

MLA Rajasingh: కేటీఆర్.. నీకు డబుల్  బెడ్రూం ఇండ్ల  డేటా అసలు తెలుసా ?   ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Rajasingh: డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి కేటీఆర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నీకు ఆ డేటా అసలు తెలుసా ? లేకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని కాని తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా కట్టలేదని రాజాసింగ్ ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో పరిస్దితి ఇది..(MLA Rajasingh)

మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం. తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారు.25 లక్షల మందకి పైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారు.అందులో ఎంతమందికి కేసీఆర్ సర్కార్ ఇళ్లు ఇస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. డబుల్ ఇండ్ల సంగతి పక్కన పెడితే.. సింగిల్ బెడ్రూం ఇండ్లు అయినా ఇవ్వండని ప్రజలు మొత్తుకుంటున్నారు. మీరు మంచి చేస్తే ప్రజలు మీకే ధన్యవాదాలు చెబుతారని అన్నారు.తర రాష్ట్రాల్లో ఇలాంటి ఇళ్లు ఎక్కడా కట్టలేదని కేటీఆర్ చెబుతున్నారు. యూపీలో సింగిల్ బెడ్రూం ఇండ్లు 15.70 లక్షలు, మధ్యప్రదేశ్ లో 7 లక్షల 80 వేలు ,మహారాష్ట్రలో 11 లక్షల 70 వేలు, గుజరాత్ లో 6 లక్షల 40 వేలు, హర్యానా లో 2 లక్షల 65 వేలు, అస్సాంలో 1 లక్ష 55 వేల ఇండ్లు కట్టించి ఇచ్చారని రాజాసింగ్ చెప్పారు. బుల్ బెడ్రూం ఇళ్ల మీరు ఎన్ని కడుతారో కట్టి ఇవ్వండి.. దాంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింది సింగిల్ బెడ్రూం ఇండ్లయినా కట్టించి ఇవ్వండని కేటీఆర్ కు రాజాసింగ్ సూచించారు.