Janagama MLA Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నిలదీసిన కూతురు తుల్జాభవాని రెడ్డి..ఎందుకో తెలుసా?
జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి కూడా కుమార్తె తుల్జా భవాని రెడ్డి కారణంగా ముత్తిరెడ్డి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. నా సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.
Janagama MLA Muthireddy Yadagiri Reddy: జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి కూడా కుమార్తె తుల్జా భవాని రెడ్డి కారణంగా ముత్తిరెడ్డి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. నా సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.
నీపై ఇప్పటికే ఓ కేసు పెట్టా.. ఇంకో కేసు కూడా పెడుతున్నానంటూ తండ్రి ముత్తిరెడ్డిని కూతురు తుల్జా భవాని రెడ్డి హెచ్చరించారు. తనకి ఇష్టం లేకున్నా చేర్యాలలో భూమి కొన్నారని, ఆ డాక్యుమెంట్లలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నింట్లో తన తండ్రి ఇరికించారని తుల్జా భవాని రెడ్డి అన్నారు.ప్రజాప్రతినిధులు,అధికారుల ముందే భూములకు సంబంధించి తన తండ్రిని ఆమె ప్రశ్నించింది.
ప్రత్యర్దులే కూతురిని తప్పుదోవ పట్టిస్తున్నారు..(Janagama MLA Muthireddy Yadagiri Reddy)
అయితే తెలివిగా కూతురికి సమాధానం ఇచ్చి పంపించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాజకీయ ప్రత్యర్థులే తన కూతురిని తప్పుదోవ పట్టించి ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని ముత్తిరెడ్డి అన్నారు. నాది కుటుంబ సమస్య.కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారు.మానసికంగా నా మనోధైర్యం దెబ్బతీయడం కోసం కుట్రలు చేస్తున్నారు.ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన జనగామలో మళ్లీ గెలుస్తాను. నా కూతురు అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని ఆడిస్తున్న డ్రామా ఇదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.