TTD: మాండూస్ తుఫాన్ ప్రభావం.. శ్రీవారి మెట్లమార్గం మూసివేత
మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో తిరుమలలో ఎడ తెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలో అధికంగా వర్షపు నీరు వస్తుండడంతో అప్రమత్తమైన టీటీడీ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీవారి నడక మార్గం తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.. తిరుమల ఘాట్ రోడ్డు గుండా మాత్రమే అనుమతిస్తుంది టిటిడి. వర్షపు నీరు మెట్ల మార్గం గుండా ప్రవహించే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడిహెచ్చరించింది.
తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మాండోస్ తుపాన్ తీరం దాటినా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటిదాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.