Last Updated:

MLA Kale Yadaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ .. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాలె యాదయ్యకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాలె యాదయ్య చేరికతో.. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లైంది.

MLA Kale Yadaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ .. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

MLA Kale Yadaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాలె యాదయ్యకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాలె యాదయ్య చేరికతో.. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లైంది.

మూడు సార్లు గెలిచిన యాదయ్య..(MLA Kale Yadaiah)

కాలె యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలిచారు. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి,2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అందువల్ల ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. మరి కొద్ది రోజులు ఓపిక పడితే మరలా బీఆర్ఎస్ దే అధికారం అని చెబుతున్నారు. కాని కేసీఆర్ మాటలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై పెద్దగా ప్రభావం చూపడం లేదనే తెలుస్తోంది. అధికారం లేనిదే ఏ పని చేయలేని పరిస్దితి నెలకొని ఉండటంతో వారు అధికార పార్టీవైపు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 17న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అప్పటి చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డిలను పార్టీలోకి చేర్చుకున్న తర్వాత ఫిరాయింపులు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మార్చి 31న, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు ఏప్రిల్‌ 7న కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజులకిందట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 

ఇవి కూడా చదవండి: