AP Assembly: ఉచిత ఇసుకపై వాడీవేడి చర్చ.. ప్రతిపక్షాలు ఏమన్నాయంటే?

AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. అధికార పార్టీలకు, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా కొనసాగింది. అయితే ఉచిత ఇషుక విధానం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా మార్పులు రాలేదని, గతంలో కంటే పెద్దగా ఏం చేశారని వైసీసీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు స్పందించారు. ఉచిత ఇసుక విధానం అమలులో నెలకొన్న సమస్యలను అధిగమిస్తున్నామని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడంతో పాటు ఎప్పటికప్పుడు వాటిని సరళీకృతం చేస్తన్నట్లు మంత్రులు తెలిపారు.