Last Updated:

Minister Roja : చంద్రబాబు.. తన బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ? – మంత్రి రోజా

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి తెదేపా అధినేత చంద్రబాబుపై  తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏ కామెంట్స్ లో బాలయ్యని తీసుకురావడం పట్ల

Minister Roja : చంద్రబాబు.. తన బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ? – మంత్రి రోజా

Minister Roja : ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి తెదేపా అధినేత చంద్రబాబుపై  తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏ కామెంట్స్ లో బాలయ్యని తీసుకురావడం పట్ల ఆయన అభిమానులు, టీడీపీ నేతలు రోజాపై నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఈ విషయంలోకి వెళ్తే..

చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైకాపా నేతలు మాట దాడికి దిగుతున్నారు. ఈ కర్మమలోనే తాజాగా రోజా చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా రోజా ప్రశ్నిస్తున్నారు. పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అయితే తాజాగా రోజా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ప్రశ్నలు సంధించారు.

ఆ ట్వీట్ లో .. ‘‘ముడుపుల కేసులో …. ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? లేక… బామ్మర్దిలా …. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ?, రామోజీలా …. మంచం ఎక్కుతాడా ?, అచ్చన్నలా …. రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ?, విజయ్ మాల్యాలా….. విదేశాలకు పారిపోతాడా ?, ఇవన్నీ కాక ఎప్పటిలానే …. మరో స్టే తెచ్చుకుంటాడా ?, అని …పలువురు గుసగుస !’’ అని రోజా ఎక్స్‌(ట్విట్టర్)‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరాల గా మారింది.