Last Updated:

Ys Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

Ys Avinash Reddy: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

Ys Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

Ys Avinash Reddy: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను కాకుండా.. వ్యక్తిని టార్గెట్ చేసే విధంగా విచారణ సాగుతోందని అవినాష్ రెడ్డి అన్నారు.

నాలుగు గంటల పాటు విచారణ.. (Ys Avinash Reddy)

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తెలిసిన వాటికి సమాధానం చెప్పానని తెలిపారు. వివేకా చనిపోయిన నాడు ఏం జరిగిందో అదే చెప్పా. నేను వెళ్లేసరికే లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్‌లో అనేక విషయాలు ఉన్నాయని తెలిపారు. విచారణ జరుగుతుండగానే మీడియా అనేక ఆరోపణలు చేస్తూ.. దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. అవినాష్ రెడ్డి అన్నారు. హత్య అనంతరం విజయమ్మ దగ్గరకు వెళితే.. బెదిరించడానికే వెళ్లానని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు కాకుండా.. నిజాలను చూపించండి అంటూ సూచించారు. టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్‌లో వస్తున్నాయని అన్నారు. ఇది గూగుల్‌ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది తేలాల్సి ఉంది. మరోసారి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదని మీడియాకు తెలిపారు.

 

ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసేలా విచారణ..

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4.30 గంటల పాటు సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని విచారించారు. అవినాష్ వెంట వచ్చిన న్యాయవాదులను సీబీఐ అధికారులు లోపలికి అనుమతించలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రెండో సారి సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. రూ.40 కోట్ల ఫండింగ్ పై సీబీఐ అనేక ప్రశ్నలు సంధించింది. న్యాయవాదుల సమక్షంలో విచారించాలని అవినాశ్ కోరగా.. అందుకు సీబీఐ అధికారులు తిరస్కరించారు. న్యాయవాదులకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. రూ. 40 కోట్ల గురించి తనకేం తెలియదని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ ది కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య జరిగిన నాడు నిందితులు ఒకే ఇంట్లో ఉన్నారని.. దానికి సంబంధించిన ఆధారాలతో విచారిస్తున్నారు.