Last Updated:

TTD Board Decisions: తిరుపతి వాసులకు దర్శనం.. టీటీడీ బోర్డు తీరుపై ప్రశంసలు

TTD Board Decisions: తిరుపతి వాసులకు దర్శనం.. టీటీడీ బోర్డు తీరుపై ప్రశంసలు

TTD Board Makes Path-Breaking Decisions: తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని సోమవారం నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తితిదే నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగించిందన్నారు.

నాటి హామీ అది..
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తిరుపతి నగర ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేరుస్తామని.. తాను హామీ ఇచ్చానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకు వెళ్లి పరిశీలించాలని సూచించానన్నారు. తిరుమల పవిత్రతను రక్షించేలా చర్యలు తీసుకుంటున్న గౌరవ సీఎంకు, టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలంటూ పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

టీం వర్క్ సూపర్..
టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాల మీదా పవన్ సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు పవన్ అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ.. ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.