Published On:

Bhargavastra: ‘భార్గవాస్త్ర’ ప్రయోగం సక్సెస్.. ఇక శత్రువులకు చుక్కలే

Bhargavastra: ‘భార్గవాస్త్ర’ ప్రయోగం సక్సెస్.. ఇక శత్రువులకు చుక్కలే

Indian Defence System: భారత్- పాక్ మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో భారత్ పైకి దాడికి దిగింది. దాడులను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసుకున్న పలు ఆయుధాలతో ధీటుగా ఎదుర్కొంది.

 

తాజాగా భారత ఆయుధ భాండాగారంలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. ‘భార్గవాస్త్ర’ పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఒడిశాలోని గోపాల్ పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో పరీక్షలు చేశారు. హార్డ్ కిల్ మోడ్ తో భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఇండియా పరీక్షించి.. విజయవంతంగా ముగించింది. ఇటీవల పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. అలాంటి డ్రోన్ల సమూహాన్ని ‘భార్గవాస్త్ర’ ఒకేసారి ఎదుర్కొనే సత్తా ఉంది. సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ వ్యవస్థ నాశనం చేయగలదు. ఇందులోని మైక్రో రాకెట్లు, క్షిపణులతో కూడిన వ్యవస్థ రక్షణ వ్యవస్థకు మరింత బలపెంచుతుందని అధికారులు చెప్పారు.

 

సోలార్ ఢిపెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్.. ‘భార్గవాస్త్ర’ను అభివృద్ధి చేసింది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో నిన్న నిర్వహించిన మూడు పరీక్షల్లో మైక్రో రాకెట్లు అన్ని లక్ష్యాలను ఛేదించాయి. రెండు పరీక్షల్లో ఒక్కో రాకెట్ ను ప్రయోగించారు. రెండు సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్ లో ప్రయోగించి ట్రయల్ రన్ చేశారు. అయితే నాలుగు రాకెట్లు అధికారులు ఆశించిన లక్ష్యాలను సాధించాయని తెలిపారు.