Last Updated:

Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్

Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్

Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం రాయితీపై నిర్ణయం తీసుకుంది. పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్నిసార్లు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ వస్తోన్న విషయం విదితమే. ఇప్పటికే తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనూ ఈ తరహా స్కీం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వడ్డీ రాయితీని ప్రకటించి, చెల్లింపు దారులకు కొంత వరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చదవండి: