Last Updated:

Naga Pratima : గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. కృష్ణా నదీ తీరాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Naga Pratima : గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. కృష్ణా నదీ తీరాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు

Naga Pratima : గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇవి పురాతన కాలం నాటివేమోనని ఆరా తీస్తున్నారు. పాడైన విగ్రహాలు తాలూకు భాగాలు అయ్యి ఉండొచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు.

నాగపాము విగ్రహాలు కావడంతో దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీతీరాన వదిలి వెళ్లి ఉంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు జరగాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి నదిలో మరిన్ని విగ్రహాలు ఉంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ విగ్రహాలు ఎప్పవిటో తెలియాలంటే వీటీ పై పరిశోధన జరగాల్సిన అవసరం వుంది. కృష్ణా నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది.

naga prathima