Last Updated:

Floods In Rajanna Sircilla District: కాలువలో కొట్టుకుపోయిన కారు… ఇద్దరు నీటమునిగి..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.

Floods In Rajanna Sircilla District: కాలువలో కొట్టుకుపోయిన కారు… ఇద్దరు నీటమునిగి..!

Floods In Rajanna Sircilla District: తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.

తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. పొంగిపొర్లుతున్న చెరువులు వాగులతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి.

ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని షాజుల్ నగర్లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పొర్లుతున్నది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కారు కాలువలో వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. అది గుర్తించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు. కాగా అప్పటికే మరో ఇద్దరు నీటమునిగి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులను గంగ (40), కిట్టు (4)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Uttarakhand: భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం

ఇవి కూడా చదవండి: