Gaddar Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా కల్కి

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను నేడు ప్రకటించారు. జ్యూరీ చైర్ పర్సన్ జయసుధతో పాటు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు పురస్కారాలను ప్రకటించారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో బెస్ట్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి.
2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులు వెల్లడించనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి.. 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలో అవార్డులను అందించనున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం సహా 21 మందికి వ్యక్తిగతంగా అవార్డులు లభించనున్నాయి. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి ఉత్తమ సేవలు అందించిన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఉత్తమ చిత్రం- కల్కి
రెండో ఉత్తమ చిత్రం- పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం- లక్కీ భాస్కర్
ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ నటి- నివేదా థామస్ (35)
ఉత్తమ నేపథ్య గాయని- శ్రేయా ఘోషల్ (పుష్ప2)
ఉత్తమ సామాజిక చిత్రం- కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం- 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్
ఉత్తమ నూతన దర్శకుడు- ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్- ఆయ్
బెస్ట్ సపోర్టింగ్ నటుడు- ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ నటి- అంబాజీపేట ఫేమ్ శరణ్య
బెస్ట్ మ్యూజిక్- భీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్ మేల్- సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
బెస్ట్ సింగర్ ఫీమేల్- శ్రేయా ఘోషల్ (పుష్ప2)
బెస్ట్ కమెడియన్స్- వెన్నెల కిషోర్ (సత్య)
ఉత్తమ బాల నటులు- అరుమఅ దేవ్ (35 చిన్నకథ కాదు), హారిక (మేర్సీ కిల్లింగ్)
బెస్ట్ రైటర్- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిక్ రైటర్- చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్ రెడ్డి (గామీ)
బెస్ట్ ఎడిటర్- నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్- అరవింద్ మీనన్ (గామీ)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్- అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
బెస్ట్ కొరియోగ్రాఫర్- గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్- నల్ల శీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డు
హీరో- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
హీరోయిన్- అనన్య నాగళ్ల (పొట్టేల్)
డైరెక్టర్- సుజీత్, సందీప్ (క)
నిర్మాత- ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
సింగర్- ఫలియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్- మత్తు వదలరా)