Home / floods
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.
బ్రెజిల్లో వరదలకారణంగా మరణించిన వారి సంఖ్య 78కి పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు, 115,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తన క్యాబినెట్‌లోని సభ్యులతో కలిసి స్థానిక అధికారులతో రెస్క్యూ మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలపై చర్చించారు.
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.
కుండపోత వర్షాల కారణంగా రియో డి జెనీరోలో 11 మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది.తుఫాను ప్రభావంతో రియోలోని ఉత్తర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, విద్యుదాఘాతాలతో ప్రజలుమరణించారు. పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అవెనిడా డి బ్రెసిల్లోని కొన్ని ప్రాంతాలలో కార్లు నీటిలో తేలాయి.
కుండపోత వర్షాల ఫలితంగా తలెత్తిన వరదలతో సోమాలియా, కెన్యాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు నుండి వరదలతో సుమారుగా 50 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవగా దక్షిణ సోమాలియాలోని గెడో ప్రాంతంలో పౌర, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.
:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్‌లకు తరలించాలని అధికారులు ఆదేశించారు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్కింగ్లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.