Last Updated:

Sharmila Vs Kavitha: మట్టికవిత.. కమలబాణం అంటూ షర్మిల, కవితల మధ్య ట్విట్టర్ వార్

వారిద్దరు పేరుగాంచిన నేతల కుమార్తెలు. అందులో ఒకరు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కాగా మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.

Sharmila Vs Kavitha: మట్టికవిత.. కమలబాణం అంటూ  షర్మిల, కవితల మధ్య ట్విట్టర్  వార్

Telangana News: వారిద్దరు పేరుగాంచిన నేతల కుమార్తెలు. అందులో ఒకరు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల కాగా మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత. వీరిద్దరి మధ్య ట్విట్టర్‌ వార్ కొనసాగుతోంది. తాజాగా కవిత షర్మిలను కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు అని విమర్శించారు షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంపై పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. ఈ క్రమంలోనే కవిత బీజేపీని ఉద్దేశించి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.

తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అని కవిత ట్వీట్ చేశారు. అయితే కవిత ట్వీట్‌పై స్పందించిన షర్మిల.. పదవులే గానీ పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవ లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు అని షర్మిల ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కవిత.. షర్మిలపై కవిత రూపంలో విమర్శలు గుప్పించారు.

అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.. పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు. మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ” కవిత” ను నేను ! అని కవిత ట్వీట్ చేశారు. మరి కవిత ట్వీట్‌పై షర్మిల స్పందించవలసి ఉంది.

ఇవి కూడా చదవండి: