Last Updated:

TSPSC: బూట్లతో కాదు చెప్పులే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కఠిన నిబంధనలు

ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్‌ చేయనున్నట్టు పేర్కొనింది.

TSPSC: బూట్లతో కాదు చెప్పులే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కఠిన నిబంధనలు

TSPSC: ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్‌ చేయనున్నట్టు పేర్కొనింది. కాగా ఈ నెల 16 ఉదయం 10.30 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. అయితే పరీక్ష సమయానికి పావుగంట ముందే పరీక్షాకేంద్రం యొక్క గేట్‌ క్లోజ్‌ చేస్తారు. అంటే.. 10.15 తర్వాత పరీక్షాకేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని టీఎస్పీఎస్సీ చెప్పింది. అలాగే పరీక్ష ముసిగే వరకు లోపలి వాళ్లు బయటకు వెళ్లే వీలు ఉండదు. మరియు పరీక్షాకేంద్రంలోకి బూట్లు అనుమతి లేదు, అభ్యర్థులు చెప్పులతోనే మాత్రమే హాజరుకావాలి. మెహిందీ, టాటూలు వంటివి కాళ్లు, చేతులపై అలంకరించుకొని రావద్దని తెలిపింది.

ఓఎంఆర్‌ ఫిల్ చేసేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిషన్‌ తెలిపింది. ఓఎంఆర్‌ షీట్‌లో వైట్‌నర్‌, చాక్‌పౌడర్‌, ఎరైజర్‌, బ్లేడు వంటివి ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాన్ని డిస్‌క్వాలిఫైగా పరిగణించనున్నట్టు పేర్కొనింది. బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్‌ ఓఎంఆర్‌లో సరిగా నింపాలని సూచించింది. సిరీస్‌ సరిగా రాసి, వృత్తాల్ని నిబంధనల ప్రకారం నింపకుంటే ఆ ఓఎంఆర్‌ను డిస్‌క్వాలిఫై చేస్తామని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రిలిమినరీ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్షకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రిలిమ్స్‌ బయోమెట్రిక్‌తో సరిపోతేనే మెయిన్స్‌ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌, ఓటరు, ఆధార్‌ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా
ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలని కమిషన్‌ పేర్కొనింది. అభ్యర్థులు హాల్‌ టికెట్లను ఏ4 సైజులో ప్రింట్‌ తీసుకుని రావాలని తెలిపింది. ఓఎంఆర్‌ పత్రంపై అభ్యర్థితోపాటు ఇన్విజిలేటర్‌ సంతకాలు ఉండాలని, ఒకవేళ ఫొటో, సంతకం ఏదైనా హాల్‌టికెట్‌పై ప్రింట్‌ కాకపోతే గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని సూచించింది

ఇదీ చదవండి: రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ షురూ.. వాటిని తీసుకెళ్లడం మర్చిపోకండి..!

ఇవి కూడా చదవండి: