Last Updated:

Samantha: ఎప్పటికీ నీ అభిమానిని – రానాపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: ఎప్పటికీ నీ అభిమానిని – రానాపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha Comments on Rana Daggubati: హీరోయిన్‌ సమంత రానాపై ఆసక్తి వ్యాఖ్యలు చేసింది. పని విషయంలో ఆయన చూపించే డెడికేషన్‌కి తాను స్ఫూర్తి పొందానంటూ ప్రశంసలు కురిపించింది. రానా కోసం ప్రత్యేకంగా సామ్‌ పోస్ట్ చేసింది. ఇప్పుడేందుకు రానా కోసం స్పెషల్‌గా పోస్ట్‌ చేసిందని ఆలోచిస్తున్నారు. నేడు (డిసెంబర్‌ 14) ఈ దగ్గుబాటి హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ భళ్లాలదేవుడుకి సామ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెష్ తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌తో రానా ఫోటోని షేర్ చేస్తూ క్యాప్షన్‌ ఇచ్చింది. “హ్యాపీ బర్త్‌డే డియర్‌ రానా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ వందశాతం ఎఫర్ట్స్‌ ఇస్తాను. నీ శ్రమించే తత్త్వం ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తుంది. నీలాగే నేను కూడా నా ప్రతిని ఇంకా బెటర్‌గా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. ఈ విషయంలో ఎప్పటికీ నేను నీ అభిమానిని. గాడ్‌ బ్లెస్‌ యూ” అంటూ హర్ట్‌ ఎమోజీలోను జత చేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్‌ వైరల్‌ అవుతుంది.

కాగా మాజీ అక్కినేని కోడలిగా రానా-సమంతలు బంధువులు అనే విషయం తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లికి ముందే సమంత, రానాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరు అన్నచెల్లెళ్లుగా బాండింగ్‌ని షేర్ చేసుకుంటుంటారు. వీరిద్దర కలిసి పలు టాక్‌ షోలో సందడి చేశారు. రానా హోస్ట్‌ చేసిన షోలలో సమంత పాల్గొంటూ ఆ షోని మరింత స్పెషల్‌గా మార్చేది. ఇప్పటికీ వీరిద్దరు మంచి స్నేహ భావంతో ఉంటారు. ఆమె మయోసైటిస్‌ బారిన పడినప్పుడు తను కోలుకోవాలని ఆశిస్తూ పోస్ట్‌ చేశాడు రానా. ఇటీవల జిగ్రా మూవీ ప్రమోషన్స్‌లో రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని చెప్పింది. అలాగే ఐఫా అవార్డు వేడుకల్లో సమంత తనకు చెల్లెలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వీరిద్దరు కలిసి తమిళ్‌ మూవీ బెంగళూరు డేస్‌ రీమేక్‌లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌ టైంలోనే వీరిద్దరి పరిచయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి: