Last Updated:

Mr Bachchan: ‘మిస్టర్‌ బచ్చన్’ డిజాస్టర్‌పై నిర్మాత రియాక్షన్‌ – నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం ఇదే!

Mr Bachchan: ‘మిస్టర్‌ బచ్చన్’ డిజాస్టర్‌పై నిర్మాత రియాక్షన్‌ – నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం ఇదే!

Producer Reacted on Mr Bachchan Flop: మాస్‌ మహారాజా రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ స్పందించారు. నిజానికి సినిమా ప్లాప్‌ అంటే నిర్మాతలు ఒప్పుకోరు. సినిమా బాగానే తీశామని, ఆడియన్సే మా కోణంలో చూడలేకపోయారంటూ ఏదోక రీజన్ చెబుతుంటారు. కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్లాప్‌ అని ఒపెన్‌ స్టేట్‌మెంటట్ ఇచ్చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మూవీ ప్లాప్‌కు కారణాలను వివరించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “మూవీ లాంచ్‌ అవ్వడానికి ఒక్కరోజు ముందే ఈప్రాజెక్ట్‌లోకి వచ్చాను. అప్పుడే రీమేక్‌ సినిమా చేయడం అవసరమా? అని అడిగాను. ఒరిజిటల్‌ స్టోరీతో సినిమా చేస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం కూడా చెప్పాను. కానీ, అప్పటికే అంతా సెట్‌ అయిపోయింది. నిర్ణయం మార్చుకునే టైం కూడా లేదు. దీంతో ఇంకేం నేను మాట్లాడలేకపోయా” అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 80ల నాటి హిందీ పాటలకు మంచి రెస్పాన్స్‌ ఉంది. ఇవి అందరికి నచ్చుతాయి కాబట్టి సినిమా ఆడేస్తుందనే ధీమాతో ఉన్నాం. కానీ అదే పెద్ద తప్పు.

సినిమా ప్లాప్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. అలాగే సినిమా లక్నోలో చిత్రీకరించడం మరోపెద్ద తప్పు. నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే అనుకుంటున్నారు. ఇదోక తప్పు అయితే షూటింగ్‌ను వేగంగా కంప్లీట్‌ చేయడం కూడా ఒక మైనసే. స్లోగా తీసుంటే కొన్ని సీన్స్‌ అయినా బాగా వచ్చేవేమో.. వాటితో అయినా మూవీ హిట్‌ అయ్యుండేదేమో అని నా అభిప్రాయం. యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది అనిపించింది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఆయన కామెంట్స్‌ చూస్తుంటే పరోక్షంగా మూవీ ప్లాప్‌కు కారణం డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ అని ఆయన చెప్పకనే చెప్పాడని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్‌. ఇదిలా ఉంటే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐపా అవార్డు వేడుకలో రానా మిస్టర్‌ బచ్చన్‌పై సటైరికల్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన రానా… మిస్టర్‌ బచ్చన్‌ని ఉద్దేశిస్తూ..ఈ ఏడాది అమితాబ్‌ బచ్చన్‌ హైలు, లోలు చూశారంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు. దీనిపై హరీష్‌ శంకర్‌ రియాక్ట్‌ కూడా అయ్యారు. ‘ఎన్నో విన్నాము, ఎన్నో చూశాం తమ్ముడు.. అన్ని రోజులు ఒకేలా ఉండవు’ అంటూ ట్వీట్‌ చేయడం నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి: