Last Updated:

PM Modi Vizag Tour: నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది నవంబర్ 11న ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటిస్తారు.

PM Modi Vizag Tour: నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది నవంబర్ 11న ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటిస్తారు. రూ.400 కోట్లతో విశాఖపట్టణం రైల్వేస్టేషన్ విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

దాదాపు 400 కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ ను దేశంలోనే అత్యుతమ స్టేషన్ లలో ఒకటిగా రూపుదిద్దే ప్రక్రియకు ఆయన శంఖుస్థాపన చేస్తారు. దాంతో పాటే విశాఖలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆయన పాలుపంచుకోనున్నారు. ఇక విశాఖలోని బీజేపీ నేతలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పార్టీ నూతన కార్యాలయానికి కూడా ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కార్యక్రమాల అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు కూడ ప్రధాని శంఖుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపధ్యంలో రైల్వే జోన్ పై స్పష్టత ఇస్తారా? స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు పై అనుకూలంగా స్పందిస్తారా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై ఏపీలో అధికారంలో వున్న వైసీపీ నేతలు, స్దానిక బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి వీటిని తీసుకువెడతారా లేదా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి: