Dacoit: అడవి శేష్ సినిమా నుంచి శ్రుతి అవుట్, మృణాల్ ఎంట్రీ.. హీరోయిన్ ఫస్ట్‌లుక్ రిలీజ్

Mrunal Thakur First Look from Decoit: అడవి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి ప్రేమకథ రూపొందుతున్న ఈ సినిమాలో తాజాగా హీరోయిన్‌ని పరిచయం చేశారు. ఇవాళ(డిసెంబర్ 17) అడవి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా డెకాయిట్ నుంచి అప్‌డేట్ ఇచ్చారు.
“తనని కాపాడాను… కానీ వదిలేసింది… తను ఏంటో, అసలు ఎవరో రేపు తెలుసొస్తది” అంటూ హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ అడవి శేష్ నిన్న పోస్ట్ చేశాడు. చెప్పినట్టుగానే ఈ రోజు డెకాయిట్‌లో తన ప్రియురాలు ఎవరో చెప్పేశాడు. చెప్పనట్టుగానే మంగళవారం ఉదయం డెకాయిట్‌లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తీసుకున్న టీం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాగా డెకాయిట్ మూవీలో మొదట శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శ్రుతి హాసన్‌కి సంబంధించని గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ లుక్ రిలీజ్ అవ్వడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. అయితే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణంపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి శ్రుతి తప్పుకోవడంతో ఆమెను మృణాల్ రీప్లేస్ చేసింది. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక దీనిపై మృణాల్ కూడా ట్వీట్ చేసింది. అడవి శేష్ సోమవారం చేసిన పోస్ట్ సమాధానంగా తన లుక్‌కి సంబంధించి ట్వీట్ వదిలింది.
అవును వదిలేసాను..
కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh
Let's kill it – #DACOIT pic.twitter.com/tH4trCr0Fe
— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024
‘అవును వదిలేసాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అంటూ డెకాయిడ్ పోస్టర్ ని షేర్ చేసింది. ఇదిలా ఉంటే అడవి శేష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డెకాయిడ్‌తో పాటు గుఢాచారీ సీక్వెల్‌లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ‘G2’ తెరకెక్కుతున్న ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Manchu Family: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు – నా ఇద్దరి కొడుకులకి ఆ హక్కు ఉంది, పోలీసులకు మోహన్ బాబు భార్య లేఖ