Last Updated:

Meta Layoffs: మరో 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..మెటా కీలక నిర్ణయం!

Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. గత నవంబర్ లో తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరో 10 వేల మంది ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.

Meta Layoffs: మరో 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..మెటా కీలక నిర్ణయం!

Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. గత నవంబర్ లో తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరో 10 వేల మంది ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.

10వేల మందికి ఉద్వాసన.. (Meta Layoffs)

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. గత నవంబర్ లో 11 వేల మందిని తొలగించగా.. తాజాగా మరో 10వేల మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. ఇక ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం ఇప్పట్లో భర్తీ చేయబోమని మెటా ప్రకటించింది.

ఈ మేరకు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. మన సంస్థలోని పది వేల మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించిందని పేర్కొన్నాడు.

అలాగే మెటాలో ఖాళీగా ఉన్న ఐదు వేల ఉద్యోగాలను సైతం.. ఇప్పట్లో భర్తీ చేయబోమని లేఖలో పేర్కొన్నారు.

2023ను సమర్థవంతమైన ఏడాదిగా జుకర్‌బర్గ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీ ఆర్థిక వ్యయాన్ని ఐదు బిలియన్లు తగ్గించాలని నిర్ణయించారు.

దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది.

తీసివేతల్లో భాగంగా ఇప్పటికే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు జారీ చేసేందుకు మెటా సిద్దమైంది. దీంతో ఈ వ్యయం 95 బిలియన్ల నుంచి 89 బిలియన్లను తగ్గనుంది.

అలానే ప్రాధాన్యంలేని ప్రాజెక్ట్‌లను కూడా తగ్గించుకోవాలని మెటా నిర్ణయించింది.

దీనివల్ల ఉద్యోగ నియామకాలు తగ్గి కంపెనీపై ఆర్థికపరమైన భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఈ నిర్ణయంతో మెటా షేర్ల విలువ రెండు శాతం మేర పెరిగాయి.

ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికాలో పెద్ద సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.

అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా వంటి టెక్ సంస్థలతోపాటు గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ వంటి ఆర్థిక రంగ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించాయి.

2022 అక్టోబరులో ట్విటర్‌తో ప్రారంభమైన ఈ లేఆఫ్‌ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు లేఆఫ్స్‌.ఫై అనే సంస్థ తెలిపింది.