Hyderabad Haleem: హైదరాబాదీ హలీమ్ కు అరుదైన అవార్డ్.. అదేంటంటే..?
భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
Hyderabad Haleem: భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
ముస్లిం సోదరుల పవిత్ర పండుగైన రంజాన్ వస్తుందంటే అందరి దృష్టి హలీమ్ పైనే ఉంటుంది. అందులోనూ ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్ నగరం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.ఈ రంజాన్ నెలలో భాగ్యనగరిలో ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌ను రుచి చూడాలని కోరుకోని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి హైదరాబాదీ హలీమ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. 2010లో హైదరాబాద్ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు ఈ హలీమ్ మోస్ట్ పాపులర్ జీఐ అవార్డుకు ఎంపికైంది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 వంటకాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ హలీమ్ ఈ అరుదైన అవార్డును అందుకుంది. భారతీయులతో పాటు విదేశీయులు సైతం ఈ ఓటింగ్లో పాల్గొని హైదరాబాదీ హలీమ్ కు పట్టం కట్టారు. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హలీమ్‌ను మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డుకు ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: ఈ టపాసులను ఎంచక్కా తినెయ్యొచ్చు..!