Nandyal: 5 పైసలకే బిర్యానీ.. ఎగబడిన జనం.. ఆఖరికి ఏం జరిగిందంటే..?
ఆఫర్ అంటే చాలు అరకిలోమీటర్ క్యూలో ఉండైనా సరే కొనుగోలు చేస్తుంటారు. ఆఫర్ ఇస్తున్నారంటే జనం ఎగబడి కొనేస్తుంటారు. ఇక, అందులోనూ బిర్యానీపై ఆఫర్ ఇస్తున్నారంటే ఇంక వదులుతారా..? వందలాది మంది గుంపులు గుంపులుగా తరలివచ్చారు.
Nandyal: ఆఫర్ అంటే చాలు అరకిలోమీటర్ క్యూలో ఉండైనా సరే కొనుగోలు చేస్తుంటారు. ఆఫర్ ఇస్తున్నారంటే జనం ఎగబడి కొనేస్తుంటారు. ఇక, అందులోనూ బిర్యానీపై ఆఫర్ ఇస్తున్నారంటే ఇంక వదులుతారా..? వందలాది మంది గుంపులు గుంపులుగా తరలివచ్చారు. దానితో తోపులాట, ఘర్షణ, ట్రాఫిక్ జామ్ వరకు వ్యవహారం వెళ్లింది. దానితో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.
నంద్యాలలోని పద్మావతి నగర్లోని ఓ రెస్టారెంట్ ఓ వెరైటీ ఆఫర్ ఎనౌన్స్ చేసింది. పాతకాలం నాణేలు అయిన ఐదు పైసలు, ఒకపైసే తెస్తే బిర్యానీ ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చింది. దానితో వందలాది మంది తరలివచ్చారు. యువకులు, మహిళలు ఇలా పెద్ద సంఖ్యలో హోటల్ ముందు బిర్యానీ కోసం క్యూకట్టారు. గుంపులు గుంపులుగా జనం తరలిరావడంతో అది కాస్తా తోపులాటకు దారితీసింది. దానితో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దానితో రెస్టారెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు ఆగ్రహంతో ఆఫర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు. చివరకు రెస్టారెంట్ ను మూయించారు.. ఆఫర్ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు రెస్టారెంట్ పై కేసులు పెడతామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇదో చేద్దామని చూస్తే ఇంకేదో అయ్యినట్టు ఆ రెస్టారెంట్ పరిస్థితి. కరెక్ట్ గా న్యూయర్ టైంలో ఆఫర్ పెట్టడంతో జనాలు ఎక్కడెక్కడ మూలనపడిన వస్తువులను సైతం వెతికి పాత నాణేలను కలెక్ట్ చేసి బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు.