Andhra pradesh: జగన్ ప్రభుత్వానికి కేంద్ర మానవ హక్కుల సంఘం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో స్కూళ్లు లేకపోవడంపై ఈ నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేదు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో స్కూళ్లు లేకపోవడంపై ఈ నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేదు. ఈ అంశాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామంలో సుమారు 60 మంది విద్యార్థులున్నప్పటికీ పాఠశాల లేకపోవడంపై వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి. 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ.. కొండలు, గుట్టలు దాటుకుంటూ విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
కనీసం టీచర్‌ను కేటాయించలేరా?(Andhra pradesh)
ఎంతో ఇబ్బంది పడుతూ ఎక్కడో ఉన్న స్కూల్ కోసం వెళుతున్న విద్యార్థుల బాధలు చూడలేక ఓ ఎన్జీవో సంస్థ తాత్కాలిక స్కూల్‌ను ఏర్పాటు చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన కేంద్ర మానవ హక్కుల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఓ ఎన్జీవో స్కూల్ ఏర్పాటు చేసినా.. కనీసం టీచర్‌ను ఎందుకు కేటాయించలేదని నోటీసుల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఎన్‌హెచ్ఆర్సీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.