Last Updated:

Andaman Nicobar: వరుస భూకంపాలు.. అండమాన్ దీవుల్లో కంపించిన భూమి

ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ప్రపంచంలోని ఏదో ఒకదగ్గర ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడిస్తున్నారు. రిక్టర్‌స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదయిందని పేర్కొంటున్నారు.

Andaman Nicobar: వరుస భూకంపాలు.. అండమాన్ దీవుల్లో కంపించిన భూమి

Andaman Nicobar: ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ప్రపంచంలోని ఏదో ఒకదగ్గర ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడిస్తున్నారు. రిక్టర్‌స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదయిందని పేర్కొంటున్నారు. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇలా ఉండగా నిన్న అనగా బుధవారం తెల్లవారుజామున నేపాల్‌తో సంభవించిన భూకంపం ధాటికి ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో 6.6 తీవ్రతతో భూ ప్రకంపణలు నమోదయ్యాయి. దానితో దోతి జిల్లాలో ఇళ్లు కూలి ఆరుగురు మరణించారు. ఇక ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, రాజధాని ప్రాంతంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని బుధవారం ఉదయం సమయంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.

ఇదీ చదవండి: అవి నన్ను బాధిస్తున్నాయి.. రష్మిక భావోద్వేగ నోట్

ఇవి కూడా చదవండి: