Home / Earthquakes
Earthquakes in telugu states: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు పలు సెకన్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపలపల్లి, చిర్ల, రంగారెడ్డి, వరంగల్, చింతకాని, భద్రాచలం ప్రాంతాలతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, విశాఖపట్నం, అక్కయ్యపాలెం, తిరువూరు, నందిగామ, పరిసర ప్రాంతాల్లో భూమి […]
తైవాన్ తూర్పు తీరంలో 24 గంటల వ్యవధిలో 6.3 తీవ్రతతో 80 భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
సోమవారం జపాన్‌లో వరుసగా బలమైన భూకంపాలు సంభవించాయి. దీనితో జపాన్ వాతావరణ సంస్ద సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను త్వరగా తీరప్రాంతాలను విడిచిపెట్టమని కోరింది.జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా మరియు సమీపంలోని ప్రిఫెక్చర్లను తాకింది,
నిమిషాల వ్యవధిలో సోమవారం నాలుగు భూకంపాలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌ను కుదిపేశాయి. లడఖ్‌లోని కార్గిల్, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 3:48 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో ఈ మూడు మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున.. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నాయి.
భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.
ఇటీవల కాలంలో వరుస భూకంపాలు ప్రపంచంలోని ఏదో ఒకదగ్గర ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు వెల్లడిస్తున్నారు. రిక్టర్‌స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదయిందని పేర్కొంటున్నారు.
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. అచే ప్రావిన్స్‌లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సుమారు ఏడుగురు మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు.సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.