Chiranjeevi: అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు – నాంపల్లి కోర్టుకు చేరుకున్న బన్నీ
Chiranjeevi Went Allu Arjun Home: సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో అల్లు అర్జున్‌కి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బన్నీ అరెస్ట్ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాసేపటి క్రితం చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి బన్నీ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్తున్న వీడియోను పీఆర్ సురేష్ తన ఎక్స్‌లో షేర్ చేశారు.
కాగా అల్లు అర్జున్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. తాజాగా బన్నీ కోర్టుకు చేరుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు వద్ద పోలీసలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసి గాంధీ ఆస్పత్రికి తరలిచారు. ఆస్పత్రిలో వైద్య చికిత్సల అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు.
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి#AlluArjun #Chiranjeevi
— Suresh PRO (@SureshPRO_) December 13, 2024