Actor Nandu: నందు షాకింగ్ నిర్ణయం – ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై, కారణమేంటంటే..!

Actor Nandu Said He Leaving Instagram: నటుడు నందు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి వైదోలుగుతున్నట్టు ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అయితే అతడి పోస్ట్ మొత్తం చదివి నెటిజన్స్ కంగుతిన్నారు. ప్రస్తుతం నందు బుల్లితెరపై ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు సినిమాల్లో సహాయ పాత్రలు, హీరో స్నేహితుడు వంటి పాత్రలు చేశాడు. అలాగే సందర్భంగా వచ్చినప్పుడల్లా హీరోగా తన లక్‌ను పరిక్షించుకున్నాడు.
హీరో పలు సినిమాలు చేసిన అతడికి ఆశించిన స్థాయిలో సక్సెస్, గుర్తింపు రాలేదు. ఇక సినిమాల్లో సహానటుడిగా పాత్రలు చేస్తున్న నందుకు కొద్ది రోజులకు ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో కొంత గ్యాప్ తర్వాత బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చాడు. స్టార్ మా స్పోర్ట్స్ ఛానల్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ సంబంధించిన షోలకు హోస్ట్‌గా, యాంకర్ వ్యవహరిస్తున్నాడు.మరోవైపు డ్యాన్స్ షోకు యాంకర్‌గా చేస్తున్నాడు. ఇలా బుల్లితెరపై యాంకర్‌గా సెటిలైపోయాడు. వరుస షోలకు హోస్ట్ చేస్తూ బిజీగా ఉంటున్న నందు తాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి వెళ్లిపోతున్నానంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.
అందరూ జాగ్రత్త..
“నేను ఇన్‌స్టాగ్రామ్‌ను వదిలేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటున్నాను. దీనివల్ల నా టైం కిల్ అయిపోతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మీరంత జాగ్రత్తగా ఉండండి. రేపు తిరిగి మళ్లీ వస్తాను” అంటూ ఈ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక దీనికి పలువురు సెలబ్రిటీలు, బుల్లితెర నటీనటులు తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక నందు భార్య, సింగర్ గీతా మాధురి తన భర్త పోస్ట్‌పై స్పందించింది. మొదట నవ్వుతున్న ఎమోజీలను పెట్టిన ఆమె ఆ తర్వాత “నువ్వు రేపు అని కాదు.. మరు క్షణంలోనే వస్తాను” అని పెట్టాలి అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం నందు పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘వామ్మో 24 గంటల బ్రేక్ హా.. అది చాలా ఎక్కువ.. అంత సేపు ఇన్‌స్టాగ్రామ్ చూడకుండ ఎలా ఉంటావు’ అని ఒకరు కామెంట్స్ చేశారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Mahesh Babu Latest Look: SSMB29లో మహేష్ బాబు కొత్త లుక్ లీక్ – సింహాన్ని క్లోజప్‌లో చూస్తున్నట్టే ఉంది..