Published On:

Russia – Ukraine war: పుతిన్ కు పిచ్చి పట్టిందా?.. ట్రంప్ ఫైర్

Russia – Ukraine war: పుతిన్ కు పిచ్చి పట్టిందా?.. ట్రంప్ ఫైర్

Trump Sensational Comments on Russia President Vladimir Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడులపై స్పందించారు. కాగా రష్యా తన డ్రోన్లు, మిస్సైళ్లతో భీకరంగా దాడులు చేయడంపై ట్రంప్ మాట్లాడారు. పుతిన్ చర్యలపై తాను అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొన్నారు. అతనికి ఏమైంది. అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు.. పుతిన్ కు పిచ్చి పట్టిందా అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ కారణం లేకుండా రష్యా దాడులు చేస్తోందని మండిపడ్డారు.

 

కాగా గత వారం రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. సుమారు 700 కు పైగా ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా తన భూభాగంలో అడ్డుకుంది. కుర్క్స్ ప్రాంతంలో పర్యటించే సమయంలో అధ్యక్షుడు పుతిన్ హెలికాప్టర్ పై కూడా డ్రోన్ దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ దాడులకు సమాధానంగా రష్యా.. ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. కీవ్ లో ఉన్న డ్రోన్, మిస్సైల్ తయారీ కేంద్రంపై దాడి చేసింది.

 

కాగా ఉక్రెయిన్ పై నిన్న జరిగిన దాడిలో 12 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లను ఉక్రెయిన్ మీదకు రష్యా ప్రయోగించింది. పలు నగరాలే లక్ష్యంగా దాడులు జరగడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. అలాగే పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు.