Donald Trump Ban 12 Countries: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం
Donald Trump Banned 12 Countries Nationals Entry to America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి వస్తున్న 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. ఈ మేరకు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అయితే ఇటీవల కొలరాడోలో యూదులపై సీసాబాంబులతో దాడికి దిగారు. ఈ కారణంగానే ట్రంప్ పలు దేశాల పౌరుల రాకపై ఆంక్షలు విధించిన తెలుస్తోంది.
ట్రంప్ విధించిన నిషేధం జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, యెమెన్, ఇరాన్, మయన్మార్, కాంగో రిపబ్లిక్, చాడ్, ఎరిట్రియా, ఈక్వటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, లిబియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఇందులో క్యూబా, బురుండి, సియోర్రా లియోన్, లావోస్, టోగో, వెనిజులా, తుర్క్ మెనిస్థాన్ వంటి దేశాలపై నిషేధం పాక్షికంగా ఉంటుందని తెలిపారు. అయితే ఈ ఉత్తర్వులు 9వ తేదీ నుంచి అమల్లో ఉంటాయని వైట్ హౌస్ అధికారులు చెప్పారు.