Donald Trump and Elon Musk: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారా?

Donald Trump threatens to deport Elon Musk as feud intensifies: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారా? అని విలేకరులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. తాను దాన్ని పరిశీలిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మస్క్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కాగా, ప్రపంచంలో ఎవరూ పొందని రాయితీలు మస్క్ అందుకుంటున్నారని, ఒకవేళ ఆగిపోతే ఆయన దుకానం సర్దుకోవాల్సిందేనని ట్రంప్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ మాట్లాడిన వీడియోను ‘దీన్ని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉంది. చాలా చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఏమీ చేయదల్చుకోలేదు’ అంటూ మస్క్ పేర్కొన్నారు.