Elon Musk: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. బిల్లు ఆమోదిస్తే రేపే కొత్త పార్టీ

Elon Musk blasts Trump’s bill and calls for new political party: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై విమర్శలు గుప్పించారు. ఈ చట్టం చాలా దారుణమైందని, ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ట్యాక్స్ పేయర్స్‌పై చాలా భారం పడుతుందన్నారు.
కాగా, ఈ బిల్లు సెనేట్‌లో పాసైతే తాను మరుసటి రోజే కొత్త ‘ది అమెరికా పార్టీ’ పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు మేలు చేసే కొత్త పార్టీ అవసరమని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని గతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అమెరికాలో మరోసారి కొత్త పార్టీపై చర్చ మొదలైంది. అయితే ఈ ఈ బిల్లు అమెరికన్లకు నష్టం కలిగించడంతో పాటు దేశంలో అప్పు పెరుగుతుందని మస్క్ విమర్శలు చేశారు.
ఇటీవల మస్క్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమెరికాలో 80శాతం మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందా? అనే ప్రశ్నతో ఒక పోల్ నిర్వహించగా.. అనూహ్య స్పందన లభించింది, ఈ పోల్ లో 81 శాతం మంది కొత్త పార్టీ అవసరమని కామెంట్స్ చేశారు.
అయితే, మస్క్ అధికారికంగా కొత్త పార్టీని ప్రకటించలేదు. కానీ, ట్రంప్‌తో విభేదాలు, ప్రజల మద్దతు, గతంలో ఆయన స్థాపించిన పీఏసీలు వంటివి ఆయన రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొనే అవకాశాలను సూచిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘ది అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు అమెరికా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.