Published On:

Pakistan-Balooch: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచ్

Pakistan-Balooch: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచ్

Balochistan big shock to Pakistan, announcement for Indepent Country: పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో జాతీయ చిహ్నం, కొత్త పార్లమెంట్ ఫొటోలు, జాతీయ గీతాన్ని షేర్ చేసింది. అంతేకాకుండా భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. ఇదిలా ఉండగా, పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం బీఎల్ఏ సహా పలు సంస్థలు దశాబ్దాల నుంచి పోరాటం చేశాయని, దీంతో చివరికి పాక్ నుంచి విముక్తి లభించిందని బెలూచిస్థాన్ అందులో పేర్కొంది.

 

పాకిస్థాన్‌లో బెలూచిస్థాన్ పెద్ద ప్రావిన్స్. గత కొంతకాలంగా స్వాత్రంత్య్ర కోసం పోరాడుతూనే ఉంది. ఇక్కడ ఉన్న వనరులను పాక్ దోచుకొని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా తమకు రాజకీయంగా హక్కులు లేవని పాక్ సైన్యం అణిచివేస్తుందని వాదనలు చేస్తున్నారు.

 

ఇందులో భాగంగానే, తమ ప్రాంతానికి సెపరేట్ కంట్రీగా గుర్తించాలని బలూచిస్థాన్ ప్రజలు పాక్‌పై పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలోనే భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్‌కు బెలూచిస్థాన్ మద్దతు తెలిపింది. ఆ తర్వాత భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. దీంతో పాక్‌పై పోరాటం చేస్తున్న బెలూచిస్థాన్.. తమను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాయి.

 

కాగా, ఈ స్వాతంత్య్ర ఉద్యమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేసింది. గత కొంతకాలంగా కునుకు లేకుండా పోరాడుతోంది. ఎంతోమంది సైనికులను కోల్పోయింది. చివరికీ స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.